మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆపద్బాంధవుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్ధిక భరోసా కల్పిస్తోందని అన్నారు. బాధితులు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రావులపెంట గ్రామానికి చెందిన శివానికి రూ.3లక్షల 50వేలు, దామరచర్లకు చెందిన సంధ్యకు రూ.2లక్షల 50వేలు, మిర్యాలగూడ పట్టణంలో శాంతినగర్ కు చెందిన మణికంఠలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఎల్ఓసీ చెక్కులను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ సాదేఖా ఖాదర్, బంటు రమేశ్, వేములపల్లి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నంద్యాల శ్రీరాం రెడ్డి, 28వ వార్డు అధ్యక్షులు గంగుల భిక్షం, శ్రీనివాస్, నాగుల్ బాబా, తదితరులు పాల్గొన్నారు.