Thursday, February 2, 2023
Home journalism school ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి రోజు, పుట్టినరోజు, బారసాల, పరామర్శలు..ఇలా వార్త కానిదంటూ ఏది లేకుండా పోయింది.మనం విన్నది…చూసింది సమంజసమయితే అదే వార్త. అయితే ఇందులో సమంజసం అంటే అర్థం కేవలం ప్రజాప్రయోజనం మాత్రమే. ఓ నేత పుట్టిన రోజును ఆయన అనుచరులు జరుపుకుంటే అది నేటి పెద్ద వార్త. ఒక చేతి నుంచి దానం చేస్తే మరో చేతికి తెలియరాదంటారు. చేసిన దానాన్ని ఎవరికీ చెప్పరాదంటారు. అయితే పేదలకు 25 కిలోల బియ్యం అందిస్తూ 20మంది ఉన్న ఫొటో ప్రచురించుకుంటూ పేదలకు ఫలానా వ్యక్తి అండదండ అంటూ అహో ఒహో అంటూ సొంత డబ్డా వార్త రాసుకుని పైగా 25 కిలోల బియ్యం అనే దగ్గర ‘25 కిలోల సన్న బియ్యం’ అని మరీ రాయించుకుంటున్నారో …రాస్తున్నారో తెలియనంతగా నేటి పాత్రికేయం విస్తరించింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేయకుండా ఏం చేస్తారు? వారి డ్యూటీనే అది. ఒకవేళ వాహనాలను తనిఖీ చేయకుండా, అప్పుడప్పుడూ సోదాలు చేయకపోతేనే అది వార్త. ఎందుకంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారిదే. ఇందుకోసమే వారు లక్షల రూపాయలు వేతనాలు అందుకుంటున్నారు. మరి వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు అని వార్తలు ఎందుకు? దానికి పబ్లిసిటీ ఎందుకు? ఈ పబ్లిసిటీ వార్తలు వారు రాసుకుంటున్నారో లేక విలేకరులు రాస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఉంది. ఇక పాఠశాలల్లో పాఠాలు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యత. దానికి పబ్లిసిటీ ఎందుకు? నేడు విద్యార్థులకు గణితాన్ని బోధించిన ఉపాధ్యాయుడు అని హెడ్డింగలు పెట్టి వస్తున్న వార్తలు ఏం జర్నలిజమో ఎవరికీ అంతుచిక్కడం లేదు. బహిరంగ సభకు బయలు దేరిన పెద్దపల్లి నేతలు…సిఎం సభను అడ్డుకుంటామన్న నల్లగొండ నాయకులు ఇలా చెప్పుకుంటూపోతే ప్రతీ అక్షరం స్వ ప్రయోజనమే. మరి అలాంటి స్వప్రయోజన వార్తలను ప్రతి అక్షరం ప్రజాప్రయోజనం అని జబ్బలు చరుచుకుంటున్న మన పత్రికలకెందుకు? విసిరిపారేయండి..అలాంటి చెత్తా చెదార పనికిమాలిన వార్తలను. మన లక్ష్యం ఒక్కటే..మన అక్షరం ఒక్కటే.. పింఛను రాని అవ్వ కోసం వెతకండి..ఒక్కపూట అన్నకోసం అల్లాడుతున్న జనాల కోసం కదలండి…ఏ దిక్కూలేని అనాథల ఆర్తనాథాలు వినండి. వెతకాలే కానీ ఒక్కటంటే ఒక్క వార్త కన్పించదా? అదే మనకు పతాక శీర్షక వార్త..అదే మీకు ఆనందాన్నిచ్చే ముచ్చట.

కె.ఆర్‌
వాస్తవం ప్రధాన సంపాదకులు

RELATED ARTICLES

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఉత్తుత్తి కొట్లాటే?

టిఆర్‌ఎస్‌, బిజెపి చాణక్య వ్యూహంకాంగ్రెస్‌ని ఖతం చేయడమే లక్ష్యమా? తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడినట్లుగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటినుంచే పార్టీలు పావులు...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

Recent Comments