జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబెర్ క్యాతం వెంకట రమణ
వాస్తవం : జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ క్యాతం వెంకటరమణ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రయాణీకులకు నెలకొన్న సౌకర్యాల విషయంలో మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో దానాపూర్ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అయ్యప్పస్వాములు అధికంగా ఉన్న తెలంగాణ ప్రాంతం నుండి కాగజ్‌నగర్, బాసర, నల్లగొండ సికింద్రాబాద్ ప్రాంతాల నుండి కేరళ అయ్యప్ప దేవస్థానానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, నాయకులు జూన్ తుల ఇంద్రారెడ్డి, శ్రీ రామ్ రెడ్డి గొట్టుముక్కల సంపత్ రావు, యాదయ్య, రాజమల్లు, దేవులపల్లి నవీన,వెంకట రాజు, రమేష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండా తిరుపతయ్య, రాజేంద్ర ప్రసాద్ పట్టణ అధ్యక్షుడు అయితే మహేష్, మురళి, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కేరళ అయ్యప్ప దేవస్థానానికి ప్రత్యేక రైలు
RELATED ARTICLES