Thursday, February 2, 2023
Home తాజా.. తాజా జిల్లా రౌండప్ కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా చుక్క గంగారెడ్డి

కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా చుక్క గంగారెడ్డి

వాస్తవం : జగిత్యాల ప్రతినిధి
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌, ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, హక్కుల నేత చుక్క గంగారెడ్డి కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ (సమాచార హక్కు, అవినీతి నిర్మూలన, పౌర హక్కులు, మానవ హక్కులు, స్వచ్చంద సంస్థ) తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా నియామకం అయ్యారు. గత కొంత కాలంగా చుక్క గంగారెడ్డి చేస్తున్న సమాజ సేవ, రైతు, ప్రజా సమస్యలపై, నిధుల దుర్వినియోగంపై చేస్తున్న పోరాటం, సమాచార హక్కు చట్టం వినియోగం, అవినీతి నిర్మూలన, పౌర, మానవ హక్కుల సాధనకై పోరాడుతున్న విధానాన్ని సిసిఆర్‌ సంస్థ గుర్తించింది. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని పలువురు సిసిఆర్‌ సంస్థ ప్రతినిధుల సూచనలు, సిఫారసు మేరకు చుక్క గంగారెడ్డి ని సిసిఆర్‌ స్వచ్చంద సంస్థకు తెలంగాణ జోనల్‌ సెక్రటరీ గా (ప్రెస్‌ అండ్‌ మీడియా విభాగం నుండి) నియమిస్తూ ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు మంచికట్ల అనిల్‌ కుమార్‌ 2021 సెప్టెంబర్‌ 30 గురువారం నియామక పత్రం జారీచేశారు. సంస్థ ద్వారా తెలంగాణ జోనల్‌ లెవల్‌ లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించుటకు, సంస్థ ద్వారా అధికారిక ప్రకటనలు జారీ చేయుటకు చుక్క గంగారెడ్డి కి అధికారాలు అప్పగిస్తున్నట్లు ఆ నియామక పత్రంలో పేర్కొన్నారు. సిసిఆర్‌ సంస్థ ఉపాధ్యక్షులు ఇల్లెందుల స్వామి, ప్రధాన కార్యదర్శి కునవేని మహేందర్‌, సహాయ సెక్రటరీ రాజ్‌ కుమార్‌, జగిత్యాల జిల్లా కన్వీనర్‌ అయిల్నేని శ్రీనివాస్‌ రావు, ప్రతినిధులు సాయిరాజ్‌, జలందర్‌, చిన్నారెడ్డి, సతీష్‌, పాలెపు రాజశేఖర్‌, ప్రసాద్‌, సురేష్‌, పలికొండ అనిల్‌, రాజేష్‌, ప్రసాద్‌, రవీందర్‌, చంద్రమౌళి, గౌరి శంకర్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

ఎస్సారెస్పీ చిన్న కాలువకు గండి! బ్రేకింగ్ న్యూస్

మానాపురం గిరిజన రైతుల గగ్గోలు. గండికి మరమ్మతులు నిర్వహించి, నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు. వాస్తవం,తుంగతుర్తి. తుంగతుర్తి మండల పరిధిలోని మానాపురం గ్రామములో ఎస్ ఆర్ ఎస్ పి69 డి బి ఎం నుండి  నీటి...

పదవులా..పక్కకు పెట్టుడా?…కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?

పదవులా..పక్కకు పెట్టుడా?కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?వాస్తవం:హైదరాబాద్‌తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ బలోపేతంపైన దృష్టి నిలిపాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్‌, బిజెపిలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

Recent Comments