చైత్రమా చెదిరిపోయావా.. మాతో చెలిమి విషపుకౌగిలిగా భావించావా..?
విగతజీవివయ్యావు
ఇక్కడున్నది ఓ తండ్రి అని తలంచావా..?
ఓ అన్నలా అక్కున చేర్చుకుంటారని ఆశపడ్డావా..??
అదంతా వట్టి మాటే..!
అంతటి కరుణామయులన్నది అభూతకల్పనే..
కామం కట్టలు తెగి
‘ఆంబోతుల్లా’ తిరుగాడే మానవమృగాలు(కొందరు మాత్రమే)ఉన్న చోటని
ఊహించని అమాయక చైత్రమా…
చాక్లెట్ మాటున సంకనేసుకుని రజస్వల ఘడియలకు ముందే నిన్ను చిదిమేసిన బడవగాళ్ల రాజ్యమిది..
కన్నవారికి కడుపుకోత మిగిల్చే నీచపు కాలమిది
ఆరేళ్ల ప్రాయంలోనే పసివాడిన చిన్నారి చైత్రమా..
నీ చావు ఒక కనువిప్పు కలిగించాలి..
పైశాచికరాయుళ్ల దాష్టీకాలకు
గుణపాఠం అవ్వాలి
మరో నిర్భయలా నీవు నిలిచిపోవాలి
అప్పుడే..!
ఈ సమాజం నీకు అర్పించే నిజమైన నివాళి..
చిన్నారి ‘చైత్ర’కు ఈ నా కవిత అంకితం..🙏🙏🙏
మట్టె రవీందర్, మందమర్రి