తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగం కల్పించిన గిరిజనుల హక్కులకు భంగం కలిగిస్తూ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా జీవోలు తీస్తూ, ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో భూ దోపిడీ ,వనరుల దోపిడీ, సింగరేణి గనుల దోపిడీ, రియల్ ఎస్టేట్ మాఫియాకు, గిరిజనేతరులకు అవకాశం కల్పిస్తూ ఆదివాసి హక్కులను కాలరాస్తూ, జిఓ ఎంఎస్ నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టివేసిందనే సాకు చూపి ఏజెన్సీ ఉద్యోగుల హక్కులకు భంగం కలిగిస్తూ 317జీవోను తీసుకరావడం తెలంగాణ ప్రభుత్వం కుట్ర అంటూ ఆదివాసీలు ఉద్యమ బాట పడుతున్నారు.కానీ,జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఉందన్న స్పృహలో లేక ఇలా ఇష్టారీతిన వ్యవరించడం ఆదివాసుల కోపం తెప్పిస్తోంది. 1950 నుండి సరసఏజెన్సీ స్థానికత ఆధారంగా లబ్దిపొందుతూ వస్తున్న ప్రత్యేక హక్కులను ఈ జీవో ద్వారా తమ హక్కులను కాలరాస్తూ ఉందని,ఏజేన్సీ ప్రాంతంలో సర్దుబాటు చేయాల్సిన ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన చట్టాలను ఉల్లంఘిస్తూ, కేసీఆర్ తన ఇష్టం వచ్చినట్టు వ్యవరిస్తున్నాడు అని జీవో నెం 317 రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఘటి స్తామని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తు న్నారు.నూతన జోనల్ వ్యవస్థ పేరుతో ఐదో షెడ్యూల్ని మొత్తం నాశనం చేస్తున్నారని,ప్రభుత్వం వెంటనే ,317 జీవో రద్దు చేయకుంటే… రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు పాఠశాలలను బహిష్కరిస్తామని ఆదిలాబాద్,వరంగల్, ఖమ్మం ఏజెన్సీలలోని రాయిసేంటర్,సార్ మేడిలు తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు శాసనసభ్యులు అత్రం సక్కుతో పాటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా ఫిర్యాదు చేశారు.ఆదివాసీ ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు కూలక తప్పవని,ప్రభుత్వ యంత్రాంగాన్ని స్థంబింపజేస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. జోనల్ పేరుతో ఏజెన్సీ ఉద్యోగులను మైదాన ప్రాంతమలోకి పంపడం మైదానంలో ఉన్న వారిని ఎజేన్సీకి పంపడం ద్వారా ఏజెన్సీ ప్రాంత హక్కులను కాలరాయడమే అవుతుంది. కానీ రాజ్యాం గంలోని 224 ,224 ఏ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక వెసులుబాటు ఉన్నది. ప్రభుత్వ ఆలోచన విధానం ఆ హక్కులను స్థానికతను కోల్పోతూ, ఆదివాసులను ఐదో షెడ్యూల్ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అంటున్నారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని,రాష్ట్రపతి లేదా గవర్నర్లు తీసుకోవల్సిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం చట్ట విరుద్ధమే అవుతుందని,భారత రాజ్యాంగంలోనిఆర్టికల్ 15 4,సెకండ్ 16 4ఎ,46,243డి,243,244,335,371డి లకు అనుగుణంగా ప్రభుత్వాలు షెడ్యూల్ ప్రాంతలలో జీవోలను చేయాలని,ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ లో చర్చించకుండా, రాష్ట్ర గవర్నర్ ఆమోదం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఇష్టానుసారం జీవోలు విడుదల చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని,తెరాస ప్రభుత్వం ఆదివాసులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తే,తిరుగుబాటు చేయాల్సిందేనని ఆదివాసులు నిర్ణయించుకున్నట్టు తెలు స్తోంది.తక్షణమే 317 జీవోను రద్దు చేయనట్లయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళనలను చేస్తూ కార్యాలయాలను మూసివేస్తామని ,షెడ్యూల్ ప్రాంతంలో పెసా చట్టం ప్రకారమే నడుచుకో వాలని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరి స్తున్నారు. ఐదో షెడ్యూల్లో ఆదివాసి హక్కులను కాలరాసే విధంగా ఉన్నారని, మైదాన ప్రాంత ఉద్యోగులకు మన్యంలో తెస్తే ఎజేన్సీ లో నిరుద్యోగం తో పాటు నిరక్షరాస్యత కూడా పెరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు ఇలా ప్రజాప్రతినిధులతో పార్లమెం టు సభ్యులతో శాసనసభ్యులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.317 జీవో రద్దు అయ్యే వరకు ప్రతి గూడెంలో పాఠశాలలకు తాళాలు వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే లంబాడిలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి విద్యాబోధన దూరమైనా బయడపని అదివాసులు, రాష్ట్ర ప్రభుత్వంపై మరో తిరుగుబాటు చేసి తమ హక్కులను సాధించుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలకు ప్రయత్నం చేసిన, సరే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రతిన పూనారు.
వెంకగారి భూమయ్య
సీనియర్ జర్నలిస్టు
రాజకీయ విశ్లేషణ