అగ్ర కథానాయిక రష్మిక మందన్నలో కవితాత్మక భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు కావడంతో ఆమె సోషల్‌మీడియా పోస్ట్‌లు చక్కటి భావాల్ని వ్యక్తం చేస్తాయి. తాజాగా ఈ అమ్మడు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ‘కళ్లలో ఇంద్రజాలం..హృదయంలో వెలుగుధారలు’ అంటూ తన ఫోటో గురించి వ్యాఖ్యానించింది. టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది ఈ సుందరి. కన్నడనాట నుంచి జాతీయ తారగా ఎదగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో ‘మిషన్ ముజ్ను’ ‘గుడ్‌బై’ సినిమాలు చేస్తున్నది.