Thursday, February 2, 2023
Home తాజా.. తాజా పదవులా..పక్కకు పెట్టుడా?...కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?

పదవులా..పక్కకు పెట్టుడా?…కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?

పదవులా..పక్కకు పెట్టుడా?
కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?
వాస్తవం:హైదరాబాద్‌
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ బలోపేతంపైన దృష్టి నిలిపాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్‌, బిజెపిలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే అధికార పక్షం టిఆర్‌ఎస్‌ పార్టీలో ప్రక్షాళన కార్యక్రమానికి నేడు నాంది పలికింది. 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. జిల్లా అధ్యక్షులుగా 19 మంది శాసనసభ్యులు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎంఎల్‌సీలు, ముగ్గురు జడ్పీఛైర్మెన్లకు జిల్లా అధ్యక్షులుగా స్థానం కల్పించింది. గత కొద్దిరోజులుగా వివిధ కార్పొరేషన్ల ఛైర్మెన్లతోపాటు వివిధరకాల నామినేటెడ్‌ పోస్టులను అధికార టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తోంది.నేడు జిల్లా అధ్యక్షుల ప్రకటనతో వచ్చే సంవత్సరం డిసెంబర్‌ నాటికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనలో సిఎం కెసిఆర్‌ ఉన్నట్లుగా కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది. మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే భారీ శస్త్ర చికిత్స తప్పదనే ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు మూడొంతుల సిట్టింగు శాసనసభ్యుల మీద నియోజకవర్గాల్లో భారీ వ్యతిరేకత ఉన్నట్లుగా క్షేత్రస్థాయిలో ఇంటా బయట వార్తలు వస్తున్నాయి. వచ్చేసారి ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కాలంటే ఆశామాషీ వ్యవహారం కాదని సర్వే ప్రాతిపదికన మాత్రమే టిక్కెట్లు దక్కుతాయనే ప్రచారం ఉంది. ఇందుకు తగ్గట్లుగా కెసిఆర్‌ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేటి జిల్లా అధ్యక్షుల ప్రకటన చూడాలని కొందరంటున్నారు. రానున్న రోజుల్లో కొందరిని పార్టీ కార్యక్రమాల్లో వినియోగించుకుని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసి ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే నేడు ప్రకటించిన జిల్లా అధ్యక్షుల కూర్పు ఉన్నట్లుగా కన్పిస్తోంది. ఎక్కువమంది శాసనసభ్యులకు జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబులో కూడా సూక్ష్మ అర్థం ఉన్నది. నేడు ప్రకటించిన జిల్లా అధ్యక్ష పదవుల్లో స్థానం సంపాదించిన శాసనసభ్యుల్లో చాలామంది నియోజకవర్గాల్లో ఇంటా బయట వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారేనని పలువురు అంటున్నారు. వీరందరిని పార్టీపదవులకు పరిమితం చేసి భవిష్యత్‌లో సర్వేల ప్రామాణికంగా ఆయా స్థానాల్లో బలమైన నేతలను బరిలో దింపే ఎత్తుగడ ఉన్నట్లుగా కొందరు అనుమానిస్తున్నారు. ఇందులో నిజానిజాల సంగతి ఎట్లున్నా కెసిఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లుగానే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అపర చాణక్యుడిగా పేరుగాంచిన కెసిఆర్‌ ఎత్తుగడలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావు. ఏ క్షణాన ఏ నిర్ణయం ప్రకటిస్తారో అనే అనుమానాలు స్వ పక్షంతోపాటు విపక్షాలు కూడా ఉలిక్కిపడుతున్నాయి.

RELATED ARTICLES

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

Recent Comments