మంత్రుల సబ్ కమిటీపై నమ్మకం లేకనేనా..?
5న అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం
రాష్ట్రంలోని గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పట్టాలు ఇస్తామని నమ్మించి,గిరిజనులను మోసం చేసిందని,మరోసారి గిరిజన తెగలకు మోసం చేసేందుకే రాష్ట్ర మంత్రులతోసబ్ కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. కాంగ్రెస్ ,జన సమితి,సిపిఐ, సిపిఎం,టిడిపి, ఇతర వామపక్షాలు,గిరిజనసంఘలు, ప్రజాసంఘలఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు రహదారులను దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చాయి. ఓ పక్క ఉప ఎన్నికతో ప్రభుత్వం సతమతమవుతుంటే,మరోపక్క అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం టిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టినట్లవుతుంది.1/70 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు 1997 సమంత జడ్జిమెంట్ ప్రకారం ,కోనేరు రంగారావు సిఫార్సుల ప్రకారం గాని జీవో ఎంఎస్ నేం 1049 తేదీ 28 -7- 2007 ప్రకారం గిరిజనేతరులకు ఏజెన్సీలో ప్రాంతంలో అన్ని శాఖల అధికారులు కూడా ఎలాంటి వ్యాపారులకు లైసెన్సులకు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏజెన్సీ గిరిజనేతరులకు లైసెన్సులు ఇచ్చి, గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తుందని,ఏజెన్సీలో నివసించే గిరిజనుల పట్ల ఫారెస్ట్ అధికారులు ఇష్టానుసారంగా చిత్రహింసలు పెడుతూ, దాడులు చేస్తూ ఆదివాసి గిరిజనులను,జైలుపాలు చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అఖిలపక్ష నాయకులు అంటున్నారు. అక్టోబర్ 5వ తారీఖున గిరిజనులు ఎక్కడైతే పోడు భూములను సాగు చేసుకుంటున్నారో అక్కడ జాతీయ రహదారులను ఒక్కరోజు మొత్తానికి దిగ్బంధం చేయాలని అఖిలపక్షానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కోదండరాం ఆధ్వర్యంలో కాంగ్రెస్, టిడిపి ,కమ్యూనిస్టు పార్టీలు గిరిజన సంఘాలు,ప్రజా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధానంగా తమ పోరాటాలు ఉంటాయని ,రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీతో కుమ్మక్కై చట్టాలను సవరణ చేస్తూ ,ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపిస్తు,పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నది. అఖిలపక్షం, పేసా చట్టం,అడవి హక్కుల చట్టలను ప్రభుత్వం తుంగలో తొక్కుతూ ఐదో షెడ్యూల్లో రాష్ట్రపతి, గవర్నర్ అనుమతి లేకుండా, ఏజెన్సీలో ఏది చేపట్టరాదు.కానీ దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాం పని చేస్తుందని ఆరోపిస్తున్నారు. గిరిజనులకు వ్యతిరేకంగా,వ్యవహరిస్తుందని,ప్రజాస్వామ్య దేశంలో సామాన్యుడు బతకలేని పరిస్థితిలో,రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు పరిపాలన జరుగుతోందని,ఆ ప్రభుత్వాల పాలనను అంతం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలు ,ప్రజా సంఘాలు ఒకే వేదిక మీదికి వచ్చి సమిష్టి నిర్ణయంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రజా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని అఖిలపక్ష నాయకులు అంటున్నారు. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదివాసీ గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకున్న,ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని లాక్కునేందుకు ప్రయత్నం చేస్తుందని,ఇచ్చినవి మరిచి మంత్రిలతో సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ,గిరిజనులకు మోసం చేసేందుకే కుట్ర పన్నిందని,గతంలోనే కోనేరు రంగారావు సిఫార్సు చేసిన పలు సూచనలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండు తో రాష్ట్ర వ్యాప్తంగా సాగుచేస్తున్నపోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,రహదారుల దిగ్బంధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కొత్త జమ్మికులతో మంత్రుల సబ్ కమిటి వేసి హుజురాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్ ప్లానింగ్ అంటున్నారు. 1969 ఉద్యమం ఫలితంగా ప్రతిష్ట చట్టం తేవాలని ఆలోచించిన పెద్దలు 1/70 చట్టం తెచ్చారని ,దీని ప్రకారం గిరిజనేతరులకు భూములు కొనుగోలు చేసే అవకాశం లేదు,కొన్న అవి చెల్లవు,అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము ,రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసం చట్టానికి తూట్లు పొడిచి,ఎజెన్సీ లో గిరిజనులకు ,గిరిజనేతరులు మధ్య వివాదాలు సృష్టిస్తు,గిరిజనులకు అమలు చేయల్సిన చట్టాల ప్రకారం భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందనే,ఇప్పటికైనా గిరిజనులకు ఇవ్వాల్సిందేనని అఖిలపక్షం ఒక్కరోజు రహదారుల దిగ్బంధం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తూ,సమరానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీ గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల విషయంలో కెసిఆర్ ఏ జిమ్మిక్కులు చేసినా పాతర వేస్తామని అఖిలపక్ష నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపథ్యంలో,రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేవరకు గిరిజనులు సాగు చేస్తున్న భూమూలకు పట్టాలు ఇవ్వాల్సిందేనని,ఆయా పార్టీలు గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు చేస్తున్న రహదారుల దిగ్బంధానికి ఏజెన్సీలో ఆదివాసులు,గిరిజనులు గూడేలలో,తండాలలో పెద్ద మొత్తంలో జనాలను రహదారులపై కి కదిలించేందుకు అయా గిరిజన సంఘాలు సమీక్ష నిర్వహిస్తున్నాయి.అక్టోబర్ 5న పోడు భూముల మహాధర్నా సక్సెస్ అవుతుందా….?లేదా..ముందస్తు అరెస్టు చేస్తుందా…?ప్రజాగ్రహానికి గురి అవుతుందా..? హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం మౌనం వయిస్తుందా.. వేచిచూడాల్సిందే..?