వాస్తవం:సింగరేణి ప్రతినిధి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్ జి టు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఓ సి పి 3 కృషి భవన్లో దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ జి టు ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళవారం నాటి బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థలను వేగవంతంగా ప్రైవేటు రంగానికి అప్పగించడానికి ఈ నిర్ణయాన్ని ప్రకటించిందన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగులకు ఐటీ మినహాయింపు ఇవ్వకుండా ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారని ఇటువంటి నిర్ణయాలను వెంటనే సమీక్షించుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయాలని లేనిచో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో కొత్త సత్యనారాయణ రెడ్డి ,చంద్రయ్య ,విజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సమ్మయ్య ,సత్యనారాయణ, చేరాలు,సంజీవ్ , రాజమౌళి ,కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు
బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
RELATED ARTICLES