సినీనటుడు నరేష్
వాస్తవం: హైదరాబాద్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఆసక్తిని రేపుతున్నాయి. మా రాజకీయ వేదిక కాదు..పదవీ వ్యామోహం సరైంది కాదని మా మాజీ అధ్యక్షుడు నరేశ్ తాజాగా చురకలంటిం చారు. బుధవారం నరేశ్ మీడియాతో మాట్లాడుతూ..కరోనా సమయంలో భవనం కంటే ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చాం. వీలైనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని పనులు చేశాం..ఇంకా కొన్ని చేయాల్సి ఉందన్నారు. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న మంచు విష్ణు ప్యానెల్‌కు మద్దతు తెలుపుతున్నట్టు మరోసారి ప్రకటించారు.సినీ నటులకు ఒక స్థానమంటూ లేదు. కానీ సరైన వాళ్లు లేరు కాబట్టి తాను ఇక్కడికి వచ్చానని ప్రకాశ్ రాజ్ చెప్పడంలో అర్థమేంటని నరేశ్ ప్రశ్నించారు.
మంచు విష్ణుకే మద్దతు
RELATED ARTICLES