మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
వాస్తవం- రాజన్న సిరిసిల్ల (ప్రతినిధి):
వేములవాడ పట్టణానికి చెందిన కటంగూరి సందీప్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్తో గత వారం రోజుల నుండి హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కేర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సందీప్ రెడ్డి కోలుకునేందుకు ఆపరేషన్ కోసం ఇప్పటివరకు దాదాపు 12లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా కొన్ని ఆపరేషన్లు చేయాలని ఇంకా దాదాపు పదిలక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు వెల్లడిరచారు . సందీప్ రెడ్డి ప్రస్తుత పరిస్థిల్లో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుచేసి చికిత్స చేస్తున్నారు. డబ్బులు కడితేనే చికిత్స కొనసాగుతుందని వైద్యులు ప్రకటించారు. ఈ దీన విషయంపై చలించి రాజన్న సిరిసిల్ల జిల్లా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వం చాటింది. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైన అమర్ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రూ. 31వేల విరాళాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు అందించారు. సందీప్ రెడ్డి చికిత్సకోసం విరాళాలు అందించినవారిలో అమర్ రూ.5 వేలు, గూడూరి మధు రూ. 3 వేలు, పిల్లి తిరుపతి రూ. 2 వేలు, రాజు రూ.2 వేలు, బజ్జిల శ్రీనివాస్ రూ. 15 వందలు, పిట్టల భూదేవి వేయి రూపాయలు, బాలయ్య వేయి రూపాయలు, నగేష్ ఐదు వందలు, రాజూరి సత్తయ్య వేయి రూపాయలు, రమేష్ వేయి రూపాయలు, కె. దేవేందర్ రెడ్డి రూ.5 వేలు, ఇంద్రకర్ రెడ్డి వేయి రూపాయలు, సంజీవ రెడ్డి రూ.3 వేలు, బాలయ్య(టీచర్) రూ. 2వేలు, జల 4 వందలు, ఎర్రం శ్రీనివాస్(రుద్రంగి) వేయి రూపాయలు, సత్యం 5 వందలు రూపాయలు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు. సందీప్ రెడ్డి కోలుకునేందుకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సందీప్ రెడ్డి కోలుకునేందుకు కొంతమంది ఆర్థిక సహాయం అందించి దాతలు మానవత్వాన్ని చాటించాలని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.
మానవత్వం చూపడానికి ఇంకా మిగిలే ఉంది
RELATED ARTICLES