తుంగతూర్తి మండల కేంద్రంలోని నేషనల్ హైవే 365 రోడ్డు వెంట ఉన్న ఐదు కిరాణా షాపుల్లో చోరీ
ఇది అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పనేనా..?
వాస్తవం: తుంగతుర్తి
తుంగతుర్తి మండల పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్న సంఘటన శుక్రవారం మండల కేంద్రంలోని చోటుచేసుకున్నది. బుధవారం జరిగిన దొంగతనం ఘటనను మరచిపోకముందే ఒకే రోజు 5 దుకాణ డబ్బాల్లో చోరీ జరగడం పలువురిని కలవరపెడుతోంది. బాధిత వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని 365 నేషనల్ హైవే ప్రక్కన నిర్మించుకున్న ఎల్ల బోయిన విష్ణు డబ్బా దుకాణంలో పది వేల రూపాయల నగదు, సిగరెట్ డబ్బాలు, బోనగిరి రాజు దుకాణం డబ్బాలో ఇండియన్ గ్యాస్ సిలిండర్ , కూల్ డ్రింక్స్ రెండు వేల నగదు, వెలుగు సతీష్ సంబంధించిన డబ్బాలో రెండు వేల రూపాయల నగదు, పది లీటర్ల పెట్రోలు, థమ్స్ అప్ బాటిల్ ఐదు, బోనగిరి సురేందర్ నివాసంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్, కరివిరాల గ్రామ పరిధిలోని వెలుగు సైదులు దుకాణ డబ్బాలు సుమారు ఐదు వేల విలువచేసే సామాగ్రి దొంగిలించినట్లు బాధితులు వాపోయారు. ఏది ఏమైనా తుంగతుర్తి మండల కేంద్రానికి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఐదు లక్షల వ్యయంతో సుమారు 30 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి రెండు సంవత్సరాలు కాకముందే, అవి పనిచేయకపోవడంతో ఇలాంటి వరుస దొంగతనాలు జరిగినా దొంగలు దొరకక పోగా.. బాధితులకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని పలువురు బాధితులు దుయ్యబట్టారు. ప్రొబిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ భావన ఆధ్వర్యంలో పంచనామ నిర్భయ కేసు నమోదు చేస్తున్నట్లు ఏది ఏమైనా జరిగిన సంఘటనపై జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక చొరవతో దొంగను పట్టుకోవడానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.