చండీగఢ్: ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అధికార పార్టీ కాంగ్రెస్, బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లకు సవాల్‌గా మారాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారు. మూస రాజకీయాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకునే ప్రయోగాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరుతూ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలను కోరారు. ఇందుకోసం మొబైల్ ఫోన్ నంబర్ని విడుదల చేశారు. ఆ ఫోన్ నంబర్‌కు తమ సందేశాల ద్వారా పంజాబ్ తదుపరి సిఎం ఎవరు ఉండాలో అనే విషయాన్ని తెలపాలంటూ ప్రకటించారు. ఈ ప్రకటనకు 24 గంటల వ్యవధిలోనే ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలు స్పందించారు. జనతా చునేగీ అప్నా జవీ డ్రైవ్ కింద పంజాబ్‌లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం ఆప్ విడుదల చేసిన ఫోన్ నంబర్‌కు కేవలం 24 గంటల్లో ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలు స్పందించారని ఆప్ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు హర్పాల్ సింగ్ చీమా శుక్రవారం తెలిపారు. గత 24 గంటల్లో మూడు లక్షలకు పైగా వాట్సాప్ సందేశాలు, నాలుగు లక్షలకు పైగా ఫోన్ కాల్లు, 50,000 టెక్స్ట్ సందేశాలు ,లక్షకు పైగా వాయిస్ సందేశాలు వచ్చాయని చీమా చెప్పారు.మొత్తం డేటాను సేకరించి క్రోడీకరించిన తర్వాత ఆప్ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆయన అన్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని ప్రజలను గురువారం అడిగిన విషయం విదితమే ఆ పదవికి తన స్వంత ప్రాధాన్యత మాత్రం భగవంత్ మాన్ అని పేర్కొన్నాడు. అయితే, కేజ్రీవాల్ అప్నా సిఎం డ్రైవ్‌ను రేసు నుండి తనను తాను మినహాయించుకున్నాడు. జనవరి 17 సాయంత్రం 5 గంటల వరకు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై ప్రజలు తమ వాయిస్‌ని రికార్డ్ చేసి టెక్స్ట్ లేదా వాట్సాప్ సందేశాలు పంపడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి పార్టీ మొబైల్ నంబర్‌ను ప్రారంభించింది. మకిలీ రాజకీయాలకు స్వస్తిపలికి సంప్రదాయ పార్టీలను తుడిచిపెట్టేందుకు పంజాబ్ ప్రజలు తమ పార్టీవైపు చూస్తున్నారని, తదుపరి ప్రభుత్వాన్ని ఆప్ ఏర్పాటు చేస్తుందని చీమా పేర్కొన్నారు.ప్రజలు స్పష్టమైన మెజారిటీతో ఆప్‌కి అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వారెవ్వా అరవింద్ కేజ్రీవాల్
RELATED ARTICLES