ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌దే రాజ్యం. సినీ ప్రపంచం కూడా డిజిటల్‌వైపు మళ్ళక తప్పడం లేదు.కొందరు నటీనటులు డిజిటల్ ప్లాట్ ఫావమ్స్ను చక్కగా వినియోగించుకుంటూ వృత్తిలో రాణిస్తున్నారు. ఇలాంటి వారిలో గ్లామర్ నటి రాశీఖన్నా కూడా ఉన్నారు. సవాళ్లతో కూడిన పాత్రల్ని ఎంచుకోవడానికి, ప్రయోగాత్మక ఇతివృత్తాల్లో భాగంకావడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు మించిన మార్గం లేదని నటి రాశీఖన్నా అంటోంది. ఓటీటీ వేదికలు కథానాయికలకు ఓ వరంగా మారాయని రాశీఖన్నా తెలిపింది. ఓపికతో ఎదురుచూస్తే మనసుకు నచ్చిన పాత్రలు వరిస్తాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాశీఖన్నా హిందీ వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో షాహిద్‌కపూర్ సరసన నటిస్తున్నది. అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ‘రుద్ర’ అనే సిరీస్‌లో కీలక పాత్రను పోషిస్తున్నది. తెలుగులో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ అనే చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.