హూజూరాబాద్‌లో కానరాని రేవంత్ రేస్?
దూసుకుపోతున్న ఈటల…చాప కింద నీరులా కారు ప్రచారం
హుజరాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు కాక మీద ఉన్నాయి. ఓ పక్క కారు, కమలం నువ్వా..నేనా అన్న రీతిలో ప్రచారంలో తలపడ్డాయి. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జాడ లేకుండా పోవడం ఆశ్చర్య పరిణామంగా పరిగణించాల్సి ఉన్నది .రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన దండోర పేరుతో కాంగ్రెస్ పార్టీ సభలు పెడుతూ.. వేడివేడి గా ఉన్న రేవంత్ రెడ్డికి హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రం డీలా పడిపోయాడు.పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో ప్రచారంలో వెనుకబడినట్లేననే వాదం విన్పిస్తోంది.దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు ఎన్నికలకు సంఘం మంగళవారం రోజున ఎన్నికల తేదీలు ఖరారు చేయడంతో ఎన్నికల కోడ్ ఆమలుకు వచ్చింది. హుజరాబాద్ ఎన్నికలు కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్కు ప్రత్యేకం కావడంతో రాష్ట్రంలో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలో గట్టిపోటీ ఇస్తే రేవంత్ రెడ్డి నియామకానికి ఊపు వచ్చినట్లే. కానీ ఇప్పటికి అభ్యర్థినే ప్రకటించలేకపోవడం కాంగ్రెస్ వ్యూహమా లేక వైఫల్యామా అనేది అంతు చిక్కడం లేదు. రాజీనామా నుంచి రాజేందర్ జోష్ పెంచడం ఓ వైపు ఉంటే మరోవైపు చాపకింద నీరులా హరీష్ రావు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం మొదలు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే 2024లో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీయే అని ప్రచారంలో దూసుక రావచ్చు. ఇప్పటికే ఆత్మగౌరవం పేరుతో ఈటల రాజేందర్ ఊరు వాడ వాడ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎంత ప్రచారం చేసినా ఇప్పటికీ గెలుపుపై సందేహాలు ఉండనే ఉన్నాయని ఆయన అంతరంగీకులు అంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆయా పార్టీలలో దడ మొదలైంది.చాప కింద నీరులా టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నా..క్షేత్రస్థాయిలో కొంత వ్యతిరేకత ఉందనే భయం టిఆర్ఎస్ వర్గాల్లో ఉంది. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా గెలుస్తామనే నమ్మకం లేదనే చెప్పవచ్చు. 40000 దళితుల ఓట్ల బ్యాంక్ అనే దళిత బంధు అస్త్రాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ గెలుపు తీరాలకు చేరాలను కున్నారు. అయితే గంపగుత్తగా దళితుల ఓటు బ్యాంక్ కారుకు మళ్ళుతుందా లేక అందులో చీలిక వస్తుందా అని కెసిఆర్ కూడా మథనపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా హుజురాబాద్‌లో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ధీమాలో కేసీఆర్ ఉన్నటుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ కార్యకర్తలకు అందించాల్సిన సామాగ్రిని చేర్చారనే చెప్పవచ్చు. రాష్ట్రంలో ఆనవాయితీ ప్రకారం అధికారంలో ఉన్న పార్టీకే సహజంగా బలం ఉంటుంది.తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి పనిచేసి కొట్లాడిన వ్యక్తి అంటూ ప్రచారంలో ఉన్న ఈటలకు విజయ అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.హూజూరబాద్లో కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం లేకపోవడం సీనియర్లు కూడా సరిగా సహకరించకపోవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్ గానే చెప్పవచ్చు. ఉప ఎన్నికలలో కొండా సురేఖ లేదా మల్లురవి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ, పార్టీ అభ్యర్థి పేరు ఇప్పటికి బయటకు రాకపోవడం రేవంత్ రేసు పెంచకపోవడం అధికార పార్టీకి లేక బిజెపి పార్టీ కలిసి వస్తుందో లేదో కానీ హుజరాబాద్లో కాంగ్రెస్ పోటీ చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామమే ఉంటుందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఎన్ని సభలు పెట్టినా ..జనాలు రావచ్చు కానీ ఎన్నికల సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే పార్టీలకు బంగ పాటు తప్పదు మరి. కెసిఆర్ ఎన్నో జిమ్మిక్కులు చేస్తూ టిఆర్ఎస్ పార్టీని రెండు సార్లు అధికారం తీసుకువచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తు, తనదైన శైలిలో రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దళిత బంధు పేరుతో ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తానంటే …ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. మాటలకే పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడితే తప్ప ఫలితం రాదు అని చెప్పవచ్చు…టిఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు పెట్టి మహిళల్లో రైతుల లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారనే విషయాన్ని మరువకూడదు. అవసరమైతే ఉచిత విద్య ,ఉచిత వైద్యం అన్ని కేసీఆర్ చెప్పవచ్చు.ఇప్పుడు బిజెపికి ప్రజా సంగ్రామం యాత్ర ముఖ్యం కాదు.టిఆర్ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అనుకుంటున్న బండి సంజయ్ కి హుజురాబాద్ ఉప ఎన్నికే ప్రత్యామ్నయం అని చెప్పవచ్చు, ఇప్పుడేప్పుడే ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్‌కు హుజరాబాద్లో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పుకునే పరిస్థితికి చేరుకోక పోతే రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి కరిష్మా పనిచేయదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ హూజూరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, బిజెపి, టిఆర్ఎస్కు కలిసొచ్చే అంశం. అయినా ఒకవేళ దళిత ఓట్లను చీల్చడం అంటే బిఎస్పి తరఫున పోటీలో ప్రవీన్ కుమార్ ఉంటే..టిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే అంశం అయ్యేది. గిరిజన, దళితులను బిజేపికేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ,చట్టాలను సవరణ చేసి దళితులకు తీవ్ర అన్యాయం చేసింది అనే భావన దళిత వర్గాల్లో ఉంది. టిఆర్ఎస్ పార్టీ గెలుపునకు కాంగ్రెస్, బిఎస్ పిపార్టీల ఓటు బ్యాంకు అవసరం. చివరకు కెసిఆర్ ఏ జిమ్మిక్కులు చేస్తారో కానీ టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎంతటి వారినైనా తన గుప్పెటకు తెచ్చుకున్నే సత్తా ఉందని చెప్పవచ్చు. బిజెపి పార్టీలో ఇప్పుడు అదే భయం పట్టుకుంది. దళితులు, గిరిజనులు ఎటు వైపు వెళ్తారోని భయం ఈటల రాజేందర్‌కి పట్టింది. మినీ రణరంగంలో రేపటి నుండి ఎవరు రేస్ పెంచుతారో చూడాల్సిందే మరి.
వెంకగారి భూమయ్య , సీనియర్ జర్నలిస్టు