హైదరాబాద్ కోకా పేటలో 150కోట్లతో మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైద్రాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో ఆదివారం ఏర్పాటైన టవర్ బ్రోచర్ ప్రోమో ప్రారంభం సందర్భంగా గంగుల మాట్లాడారు.
ప్రభుత్వం మున్నూరుకాపుల కోసం 5ఎకరాల భూమి ,ఐదుకోట్లను ప్రకటించిందన్నారు .ఇంకా మరో 10కోట్ల విడుదలకోసం సీఎం కెసిఆర్‌ను కలుస్తానన్నారు. ఎంకే టవర్స్ నిర్మాణం కోసం దాతృత్వ సేవ గుణం ఉన్న కులబందువుల నుంచి నిధులు సేకరిస్తామన్నారు .
ఎంకే టవర్స్ నిర్మాణం తెలంగాణలో మున్నూరుకాపుల ఆత్మగౌరవాన్ని పెంచుతుందని అయన ధీమా వ్యక్తం చేశారు .ఈ శ్రావణ మాసం లోపే టవర్స్‌కు శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసి నిర్మాణం పనులు చేపడుతామన్నారు .కె.కేశవ రావు మాట్లాడుతూ టవర్స్ నిర్మాణం నమూనా బాగుందనీ కొనియాడారు .విద్యార్ధి వసతి గృహాలు అన్ని వసతులతో స్కిల్ పెంచే తరహాలో నిర్మాణం చేపట్టాలన్నారు .ఎంకే టవర్స్ నిర్మాణానికి తనవంతు సహకారముంటుండదన్నారు .
వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొండా దేవయ్య మాట్లాడారు.గత ఇరవై ఏళ్ళనుంచి కుల ఐక్యత కోసం పాటుపడుతూ వస్తున్నానని గతంలో వేములవాడలో నిత్యాన్నదాన సత్రం కుల బందువుల దాతృత్వ సహకారంతో నిర్మాణం చేశానన్నారు .
ఈ కార్యక్రమంలో కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పుటం పురుషోత్తం రావు ,కో -కన్వీనర్ చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు .టవర్స్ నమూనాను ఆర్కిటెక్ విష్ణు వర్ధన్ రూపొందించారు .
150కోట్లతో ఎంకే టవర్స్ నిర్మాణం
RELATED ARTICLES