రాహుల్‌ మహాపాదయాత్రకు మద్దతివ్వండి
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య
పెద్దపల్లి :వాస్తవం
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ కమిటీి ఆధ్వర్యంలో జోడో పాదయాత్ర కార్యక్రమానికి సంఫీుభావంగా పెద్దపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అధ్వర్యంలో సంఫీుభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య మాట్లాడుతూ ఎఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశవ్యా ప్తంగా బుధవారం చేపట్టిన పాదయాత్ర కన్యాకు మారిలో ప్రారంభమైనందున వారికి మద్దతుగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ పక్షాన సంఫీుభావం తెలుపుతున్నామని అన్నారు.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంట నూనెలు,నిత్యవసర వస్తువులు పెరుగుతున్న ధరలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్య ప్రజలపై మళ్లీ నిత్యావసర వస్తువులపై వస్తు సేవల పన్ను అదనపు భారాన్ని మోపాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై కూడా జిఎస్‌టి విధిం చడమే కాకుండా పాల ధరలను కూడ పెంచిందని ద్రవ్యోల్బణం నుండి పౌరులకు ఉపశమనం కల్పించడం లో కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్షాలను వేధించే విధంగా కుట్రలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆనాడు తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడామో నేడు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కంకణ బద్ధులై రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ వరకు 150 రోజులకు పైగా దాదాపు 3500 కిలోమీటర్ల వరకు చేపడుతున్న పాదయాత్రకు దేశ ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపు నిచ్చారు. .ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ భూషణవేణి రమేశ్‌ గౌడ్‌ ,ఓదెల జెడ్పీటీసీ సభ్యులు గంట రాములు, పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు భూషణ వేణి సురేష్‌ గౌడ్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కోలిపాక సుజాత ,జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షులు ఎస్‌ కే అక్బర్‌ అలీ, సుల్తానాబాద్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు దన్నాయక్‌, దామోదర్‌ జిల్లా అధి కార ప్రతినిధి సుతారి లక్ష్మణ్‌ బాబు ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ పి రాజయ్య గౌడ్‌, జిల్లా కార్యదర్శి పి యస్‌ విజయ్‌ కుమార్‌ ,జిల్లా సంయుక్త కార్యదర్శి ఉట్ల కిరణ్‌ ,కమాన్‌ పూర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజయ్య , కౌన్సిలర్‌ లు భుతగడ్డ సంపత్‌ , తూముల సుభాష్‌ ,బొడ్డుపల్లి శ్రీనివాస్‌ ,బోడ్డుపల్లి శ్రీనివాస్‌, సయ్యద్‌ మస్రత్‌, తాడురి శ్రీమాన్‌ , కొల అనిల్‌ కుమార్‌, దబ్బెట అనిల్‌ ,ఎంచర్ల తిరుమలేష్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *