రూ 24.60 లక్షలతో సొంతం చేసుకున్న వంగేటి లక్ష్మారెడ్డి
వాస్తవం: హైదరాబాద్‌
గణేష్‌ నిమజ్జనం నాడు అందరూ బాలాపూర్‌ వైపే చూస్తారు. బాలాపూర్‌ లడ్డూ వేలంకు ఉండడే క్రేజ్‌ మామూలుగా ఉండదు. ప్రతీ ఏడాదికి వేలం ధర పెరుగుతోంది. ఈ ఏడాది అదే జరిగింది. రికార్డు స్థాయిలో ఈ సారి బాలాపూర్‌ లడ్డూ వేలంలో రూ 24.60 లక్షలు పలికింది. గణేష్‌ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది కంటే ఈ సారి రూ 5.70 లక్షల అధికంగా ధర పలికింది. బాలాపూర్‌ ముఖ్యకూడలి బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాటబాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలంపాటలో 9 మంది పోటీ పడ్డారు. లడ్డూ కోసం పోటీ పడిన వారిలో ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు వేలంలో పాల్గొన్నారు. చివరకు రికార్డు ధరకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది 2021లో జరిగిన వేలంలో ఏకంగా 18 లక్షల 90 వేలు పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ వేలంలో లడ్డూ సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *