Thursday, February 2, 2023
Home జాతీయం mood of the telangana కెసిఆర్‌ ఇమేజ్‌పైనే సిట్టింగుల చూపు…మూడ్‌ ఆఫ్‌ది తెలంగాణ ఎట్లున్నది?

mood of the telangana కెసిఆర్‌ ఇమేజ్‌పైనే సిట్టింగుల చూపు…మూడ్‌ ఆఫ్‌ది తెలంగాణ ఎట్లున్నది?

గురువారం సీ ఓటర్‌- ఇండియా టుడే సంయుక్త పేరిట సర్వే వెల్లడిరచిన అంశాలు రాష్ట్రాల్లో అధికార పార్టీలను కలవరానికి గురిచేసేవే. తెలంగాణలో కూడా ఈ సర్వేలోని అంశాలను అన్వయించుకోవాల్సిందిగా రాజకీయ విశ్లేషకులు కొందరంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే టిఆర్‌ఎస్‌ రెండోసారి రాష్ట్రంలో అధికారాన్ని అందుకోగలిగింది. పదవీకాలం రెండు టర్మ్‌లు పూర్తి చేసుకోబోతున్న శాసనసభ్యులు చాలామందే ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ కూడా రెండు టర్మ్‌లు పూర్తి చేసుకుని ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ‘మూడ్‌ ఆఫ్‌ ది తెలంగాణ’ ఎలా ఉంటుంది? అనే పరిస్థితులను విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే నాయకుడిగా, రాష్ట్రాధినేతగా సిఎం కెసిఆర్‌తో సరిపోల్చదగ్గ నేతలు ప్రతిపక్షాల్లో కొరవడటం నిజంగా టిఆర్‌ఎస్‌కి పెట్టని కోటగా ఉన్నది. ఇదే బలంతో రెండో దఫా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందనే యథార్థాన్ని కాదనలేం. అయితే మొదటిసారి ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా టిఆర్‌ఎస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంటే రెండోసారి కెసిఆర్‌ పాలన మీద ప్రజల్లో ఉన్న చెక్కుచెదరని నమ్మకంతోనే టిఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఆ పరిస్థితుల్లో స్థానిక సిట్టింగు శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత కెసిఆర్‌ ప్రభలో కొట్టుకుపోయింది. అయితే ఇప్పుడు మూడోసారి కెసిఆర్‌ నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా మూడొంతుల సిట్టింగు శాసనసభ్యుల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. రెండోసారి ఎన్నికల సమయాన ఉన్న వ్యతిరేకత కన్నా ఇప్పుడు ఆ మోతాదు మరింత ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా మొదటిసారి ఉద్యమ పార్టీగా చేసిన పోరాటంతో అధికారాన్ని ప్రజలు టిఆర్‌ఎస్‌కు కట్టబెట్టారు. ఐదేండ్ల పాలన అనంతరం మరో మారు అధాకారాన్ని అందిస్తే మిగిలిన పెండిరగ్‌ పనులు పూర్తవుతాయని కెసిఆర్‌ మీద నమ్మకంతో టిఆర్‌ఎస్‌కు రెండోసారి అధికారాన్ని అందించారు. రెండోసారి అధికారాన్ని చేపట్టి ఇప్పటికే సగం కాలం పూర్తయింది. ఈ సమయంలో ప్రభత్వ పరంగా ఎన్నో సవాళ్లు..వైఫల్యాలను అధికార పార్టీ మూటగట్టుకున్నది. కొన్ని విషయాల్లో అద్భుత ఫలితాలను అందుకున్న మాట వాస్తవమే. కొన్ని అంశాల్లో పాలనా పరంగా, శాంతిభద్రతల పరంగా కెసిఆర్‌ నాయకత్వం ప్రజల మెప్పును బాగా పొందగలిగింది. అయితే ఇచ్చిన హామీలు చాలామటుకు గడప దాటలేదనే అపప్రథ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తోంది. తెలంగాణ వచ్చినంక నిరుద్యోగ సమస్య తీరుతుందని గంపెడాశ పెట్టుకున్న యువతకు మొండి చేయ్యే ఎదురయిందని ఆ వర్గం రగిలిపోతోంది. అదేవిధంగా రైతుబంధు పథకంతో రైతన్నలను ఆకర్శించగలిగినా పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, అకాల వర్షాలతో తీరని నష్టం, వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితులు రైతాంగంలో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం లేకుండా చేసిందనే చెప్పవచ్చు. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడినా ఈ ఏడేళ్లకాలంలో పల్లెల్లో అనుకున్నంత అభివృద్ధి లేకపోవడం కూడా ప్రతిబంధకమే. అదేవిధంగా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, కొత్త ఫించన్ల మంజూరు వంటి అంశాలు పట్టాలెక్కకపోవడం కూడా కెసిఆర్‌ పాలనలో ఇబ్బందికర పరిణామమే. ఇలా చెప్పుకుంటూపోతే అనేక అంశాలు కెసిఆర్‌ ప్రభను మసకబారేలా చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. ఓ పక్క కెసిఆర్‌ పాలన మీద ఉన్న వ్యతిరేకత అధికార పార్టీని ఇరుకునపెడుతోంటో మరోపక్క సిట్టింగు శాసనసభ్యుల పరిస్థితి మరింత వేధిస్తోంది. ఇప్పుడు అధికార టిఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న సిట్టింగు శాసనసభ్యుల మీద ప్రజావ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉన్నది. దీనికి తోడు ఇంటిపోరు కూడా ఆ పార్టీ సిట్టింగు శాసనసభ్యుల మీద మోతాదుకు మించే ఉన్నది. శృతిమించిన వ్యవహారాలకు పాల్పడటం, పైరవీలు, రియల్‌ దందాలతోపాటు సంపాదనే ధ్యేయంగా కొందరు సిట్టింగులు ప్రజాసమస్యలను గాలికొదిలేసినట్లుగా ఆరోపణలున్నాయి. మరి ఇలాంటి వారితో కెసిఆర్‌ మళ్లీ బరిలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇప్పుడున్న సిట్టింగు శాసనసభ్యుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కెసిఆర్‌ ఇమేజ్‌ని మాత్రమే నమ్ముకుని గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఇదే పరిస్థితి ఉమ్మడి వరంగల్‌లో కూడా ఉన్నట్లుగా అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌,నిజామాబాద్‌ ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగు శాసనసభ్యుల పరిస్థితి గాల్లో దీపం మాదిరిగానే ఉన్నదనే యథార్థం ఒప్పుకోకతప్పదు. మరి ఈ పరిస్థితుల్లో మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే శస్త్ర చికిత్స తప్పనిసరి. అయితే కెసిఆర్‌ ప్రభుత్వానికి ఉన్న అదృష్టం ఒక్కటే. ప్రతిపక్షాలు ఇంకా బలాన్ని పుంజుకోకపోవడం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ టిఆర్‌ఎస్‌ని ఢీకొట్టే సామర్థ్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినా ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు ఒకడుగు ముందుకు రెండడగులు వెనక్కి అన్న చందంగా ఆ పార్టీ పరిస్థితి ఉన్నది. ఇక మరో జాతీయ పార్టీ బిజెపి తమ ప్రధాన శత్రువు కాంగ్రెస్‌ని నిర్వీర్యం చేసి ఎలాగైనా రేస్‌లో నిలవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ దూకుడు రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. అయితే బిజెపిలో కూడా ఇంటిపోరు ఎక్కువయినట్లుగానే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇలా ప్రతిపక్షాల బలహీనతలు అధికార పక్షానికి వరంగా మారినట్లుగా చెప్పవచ్చు. అంటే ‘మూడ్‌ ఆఫ్‌ ది తెలంగాణ ’ను చూస్తే అధికార పార్టీ నాయకుడిగా కెసిఆర్‌ ఇమేజ్‌తో పాటు ప్రతిపక్షాల వైఫల్యాల మీద గట్టెక్కె పరిస్థితులు ఉన్నాయే తప్ప స్థానిక సిట్టింగు శాసనసభ్యుల పనితీరుతో కాదని చెప్పవచ్చు. అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే అధికార పార్టీ సిట్టింగు శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత ప్రభంజనమైతే టిఆర్‌ఎస్‌కు గడ్డుపరిస్థితులను ఎదుర్కోక తప్పదు. అపర చాణక్యుడిగా పేరుగాంచిన కెసిఆర్‌ రాజకీయ ఎత్తుగడలు వేయడంలో తనకు మరెవరూ సాటిరారని పలుమార్లు నిరూపించుకోగలిగారు. ఇప్పుడు కూడా సిట్టింగు శాసనసభ్యుల్లో మెజార్టీ సభ్యుల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గతంలో ఇలాంటి ఫార్ములా ఉపయోగించి దేశంలో చాలామంది నేతలు విజయవంతం అయ్యారు. కెసిఆర్‌ కూడా సర్వే పేరుతో ఎప్పటికప్పుడు సిట్టింగు శాసనసభ్యుల పనితీరు, వారిపై వస్తున్న ఆరోపణలపై నివేదికలు తెప్పించుకుని ఈమారు ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం ఆ పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. మొత్తం మీద దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్‌- ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చిన విషయం తెలంగాణకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా… రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. అంటే దీనర్థం నాయత్వం మీద ప్రజాభిమానం సడలకున్నా సిట్టింగుల మీద వ్యతిరేకత ఉప్పెనలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా నాయకుడిగా కెసిఆర్‌ మీద ఇమేజ్‌ జనాల్లో చెక్కుచెదరకున్నా నియోజకవర్గాలకు వచ్చేసరికి సిట్టింగుల మీద ప్రజాగ్రహం సునామీలా ఉన్నదనే విషయం గమనించాల్సి ఉన్నది. ఈ అంశాన్ని టిఆర్‌ఎస్‌ ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే.

RELATED ARTICLES

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

Recent Comments