Thursday, February 2, 2023
Home Uncategorized Three Killed In Jagityal | జగిత్యాలలో ముగ్గురు హత్య

Three Killed In Jagityal | జగిత్యాలలో ముగ్గురు హత్య

(కె.ఆర్‌)
మంత్రాలకు చింతకాయలు రాలకున్నా మనుషుల తలలు మాత్రం నిత్యం ఎక్కడో ఒచోట రాలుతూనే ఉన్నాయి.అరుణ గ్రహం మీదకి మనుషులు అడుగుపెట్టామని గొప్పగా చెప్పుకుంటున్నా ఇంకా ఆటవిక, మూఢ నమ్మకాల ప్రభావం మనుషులను వీడటం లేదు. మనిషి చేసిన రాయి రప్పలకు సాగిలపడి మొక్కుతూ ఆ మనిషినే హీనంగా చూస్తూ మానవత్వాన్ని మర్చిపోతున్నారు.కనులు తెరిచి చూడాలే కానీ సాటి మనిషిలో కన్పించదా దైవత్వం అని ఎందరో కవులు మానవత్వంలోని గొప్పదనాన్ని కళ్లకు కట్టారు. అయితే మానవత్వం సంగతి అటుంచితే సాటి మనిషినే మంత్రాల నెపమనో మరొక కారణమనో అత్యంత కర్కషంగా సాటి మనుషులే అంతమొందిస్తున్నారు. తాజాగా గురువారం జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్‌ మండలం తారకరామ నగర్‌లో ముగ్గురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య చేశారు. తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్ధులు దాడి చేసి హత్య చేశారు. మంత్రాల నేపంతో ఈ ముగ్గురిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంత శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందినా ఇంకా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దారుణం.

అనాదిగా కొనసాగుతున్న ఆటవిక చర్యలు

మంత్రాలు, చేతబడులు, బాణామతులు చేస్తున్నారనే అనుమానంతో ఎన్నో నిండుప్రాణాలను కర్కషంగా అంతమొందిచే ఆటవిక నేర చరిత్ర ఈ నాటిది కాదు. అనాదిగా ఈ ఆటవిక హింసా ప్రవృతి కొనసాగుతూ వస్తోంది. ఈ దారుణ మారణకాండకు ఎన్నో ప్రాణాలు నేలకొరిగాయి. దీనికి కారణం అనుమానమనే పెనుభూతం మనిషిని ఆవహించి మానవత్వాన్ని మరిచేలా చేస్తోంది. దీంతో తమకు చీమంత హాని జరిగినా దానికి కారణం తాము అపోహపడేవారేనని వారి తలలు నరికేదాకా శాంతించడంలేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఇలాంటి మూఢనమ్మకాలతో రోజూ ఎక్కడో ఓ చోట మనిషి తలకాయలు రాలుతూనే ఉన్నాయి. మంత్రాల నెపాన్ని మోపిన వ్యక్తులను సాటి మనుషులే క్రూరంగా హింసించి సామూహికంగా, బహిరంగంగా అంతమొందించిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. మంత్రాలు, చేతబడులు చేస్నున్నారనే అనుమానం ఉన్న వ్యక్తుల నెత్తి జుత్తు గొరగడం, పల్లు ఊడగొట్టడం, నోట్లో మూత్ర విసర్జన, మల విసర్జన చేయడంతోపాటు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి దాడులు చేసి చచ్చేదాక కొట్టిన దారుణ ఉదంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలాంటి సంసృతి నాడు అనాగరిక మానవ సమాజంలో చోటుచేసుకున్నాయి…అరుణ గ్రహం మీదికి మనిషి అడుగుపెట్టిన నేటి ఆధునిక కాలంలోనూ జరుగుతున్నాయి.ఉన్నదల్లా సంఖ్యలో తేడా మాత్రమే.
ప్రాణాల మీదకి తెస్తున్న మంత్రాలు
కొందరు బలహీనులు తమని తాము శక్తి వంతులుగా నిరూపించుకోవడానికి మంత్రాలను ఆశ్రయిస్తున్నారు. తమకు మంత్రాలు వస్తాయనే ప్రచారాన్ని చేపడుతూ సమాజంలో తాము బలవంతులం అని నిరూపించుకోవడానికి తాంత్రిక విద్యలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నమే వారి పాలిట మరణశాసనంగా మారుతోంది. ఎదుటివారి మానసిక స్థైయిర్యాన్ని దెబ్బతీసి తాము పైచేయి సాధించే అభూతకల్పనే మంత్రవిద్య. ఇలాంటి విద్యను ఆశ్రయించి గ్రామాల్లో, పట్టణాల్లో తమకు గిట్టనివారిని, తమకు శత్రువులను దెబ్బతీయడానికి ఈ మంత్రాలను ఉపయోగిస్తూ చివరికి ఆ మంత్రాల నెపానికే వారు బలవుతున్నారు.

దెయ్యాలని పుట్టిస్తున్న స్వార్థపరులు

పంట కాలువల మీద నీటి కొరత ఏర్పడిన సందర్భంలో తమ పొలానికి నీళ్లు పారించుకోవడానికి రాత్రివేళల్లో దెయ్యాలు తిరుగుతున్నాయని ప్రచారం చేపట్టడంతో ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రాకపోవడంతో తను ఎంచక్కా తన పొలానికి నీళ్లు పారించుకున్న తెలివైన రైతులు ఉన్నారు. ఇక్కడ తన పొలానికి నీళ్లు పారాలంటే సాటి రైతులు పోటీ నుంచి తప్పుకోవాలి.దీంతో సదరు రైతు తెలివిగా దెయ్యాన్ని పుట్టించాడు. కల్లు లొట్లు దొంగతనం అవుతుంటే దొంగలబారి నుంచి కల్లు లొట్లను కాపాడుకోవాలని రాత్రిపూట దెయ్యం సంచరిస్తున్నదని ప్రచారం చేపడితే ఈత వనాలవైపు రాత్రుల్లో ఆకతాయిలు, దొంగలు కన్పించకుండా పోతారు. ఇక్కడ తమ కల్లు లొట్లను కాపాడుకోవడానికి కొందరు వ్యక్తులు దెయ్యాలను పుట్టించారు. అలాగే ఇనుప స్క్రాప్‌ను రాత్రివేళల్లో దొంగతనం చేయాలంటే ఇళ్లలోనుంచి ఎవరూ బయటికి రాకుండా తమ స్మగ్లింగ్‌ సాఫీగా సాగడానికి దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం చేపట్టి బొగ్గు, ఇనుము దొంగలు తమ పని రాత్రివేళల్లో సాఫీగా పూర్తిచేశాస్తారు ఇలా చెప్పుకుంటూపోతే అనేక చీకటి యవ్వారాల్లో దెయ్యాలు పుడుతూనే ఉంటాయి. దెయ్యం ఉన్నదని నమ్మిన మనుషులు మంత్రాలున్నాయని నమ్ముతారు..మంత్రాలున్నాయని నమ్మిన మనుషులు..చేతబడులున్నాయని నమ్ముతారు..చేతబడులు ఉన్నాయని నమ్మిన అమాయకులు తమకు వాతం చేసి కాళ్లు నొప్పులు వచ్చినా..తమ ఇంట్లో పాలు పొంగినా దానికి మంత్రాల నెపాన్నే వేసి తమకు గిట్టనివారిపై అపోహ పెంచుకుని ఆ ఆపోహను పెద్దదిగా చేసుకుని వారిపై, అనుమానం పెనుభూతమై సాటివారినే అంతమొందిస్తారు.

చట్టాలు ఎన్ని తెచ్చినా..?

బాణామతి, చేతబడులు, మంత్రాల నెపం వంటి అనేక మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తెచ్చినా ఈ దారుణ మారణ కాండ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అయితే ప్రభత్వం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాలతోనే అక్షరాస్యత పెరగడం మూలంగానో , చట్టాలతోనే ఇప్పుడు ఇలాంటి దుశ్చర్యలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినట్లుగానే చెప్పవచ్చు. అయితే అనాదిగా కొనసాగుతూ వస్తోన్న ఈ ఆటవిక హింసా ప్రవృత్తిని పూర్తిగా రూపు మాపాలంటే మనిషిలో మానవత్వపు వాసనలు పూర్తిగా ఇంకిపోకుండా చూడాలి. మానవుడే మాధవుడు అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటాలి.మానవత్వంలేని లోకాన్ని స్తుతించలేను..మానవునిగా శిరసెత్తుక తిరగలేను అనే సందేశాన్ని నలుదిక్కులా వ్యాపింపజేయాలి. అప్పుడే జగిత్యాల లాంటి దారుణ ఘటనే చివరిదిగా మిగిలిపోతుంది. లేదంటే నిన్న జగిత్యాల..నేడు ఇంకోచోట..రేపు మరోచోట మంత్రాలకు తలకాయలు రాలుతూనే ఉంటాయ్‌. రాలిన తలకాయల సంఖ్యలో తేడా మాత్రమే ఉంటుంది తప్ప మంత్రాల నెపంలో మార్పు మాత్రం ఉండకపోవచ్చు.

RELATED ARTICLES

మానవత్వం చూపడానికి ఇంకా మిగిలే ఉంది

మై వేములవాడ చారిటబుల్‌ ట్రస్ట్‌వాస్తవం- రాజన్న సిరిసిల్ల (ప్రతినిధి):వేములవాడ పట్టణానికి చెందిన కటంగూరి సందీప్‌ రెడ్డి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో గత వారం రోజుల నుండి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని కేర్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు....

Professor Kodandaram Sensational Interview on Contemporary Politics

https://www.youtube.com/embed/7eVmKX6WuFk

Vasthavam Diamond Edition 17

zoom 1page zoom 2page

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

Recent Comments